ఏపీ రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతోందని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ &హెల్పర్స్ (టిఎన్టీయుసీ) అనుబంధ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనం పడుతోందని దుయ్యబట్టారు.