పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై ఎన్ఐఏ దాడుల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని మోడీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని తేలింది. ఈ ఏడాది జులై 12న మోడీ పాట్నా పర్యటనలో ఆయనపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ విఫలయత్నం చేసిందని తెలుస్తోంది. యూపీలోని ప్రముఖులపై కూడా దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం పలువురికి శిక్షణ ఇచ్చినట్లు వివరించింది.