కుప్పం సభలో సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై విరుచుకుబడ్డారు. శుక్రవారం అయన చేయూత మాట్లాడుతూ... చంద్రబాబును 33 ఏళ్లుగా గెలిపించినా కూడా ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఓటు కూడా లేదు. కుప్పం తన సొంతం అని ఆయన ఏనాడూ భావించ లేదు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్న ఆయన అక్కడ లోకల్, కుప్పంకు నాన్ లోకల్. నా దృష్టిలో పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతే. ఈ ప్రాంత ప్రజల కోసం రూ.250 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ సమస్యలు తొలగ్గానే రూ.120 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ కోసం రూ.66 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన నాలుగు మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరం అని భరత్ అడిగాడు. నువ్వు నియోజకవర్గంలో తిరుగు.... ఆ నిధులు ఇస్తానని చెబుతున్నా అని తెలియజేసారు.