అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్ ఎస్ ఎస్ దినోత్సవము ను విద్యార్థులు అధ్యాపకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ బి శివమ్మ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ. విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఫరూఖ్ భాషా మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక స్పృహను పెంచుకోవాలని అలాగనే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని, జాతి సమైక్యత కు తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతరలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.