ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా హసన్పూర్ గ్రామంలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. స్థానికంగా ఇద్దరు అక్కా చెల్లెళ్ల వివాహాలను ఒకేసారి చేశారు. బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పిలవని వారు కూడా వచ్చారేమో అని పెళ్లింటి వారు కంగారు పడ్డారు. ఆధార్ కార్డులు చూపిస్తేనే అతిథులను భోజనాలకు అనుమతించారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ అతిథులు ఆశ్చర్యపోయారు.