కజిరంగా నేషనల్ పార్క్ లోపల సఫారీకి సంబంధించి సద్గురు జగ్గీ వాసుదేవ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నిర్ణీత సందర్శన సమయానికి మించి పార్క్‌లోకి ప్రవేశించారని, 1972 వన్యప్రాణి (రక్షణ) చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో సమీప గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే రాత్రిపూట పార్కులోకి ప్రవేశించకుండా ప్రజలను ఏ చట్టం ఆపలేదని సీఎం హింత బిశ్వ శర్మ అన్నారు.