దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోంది. తొలి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 6వ అంతస్తులో ప్రత్యేకంగా ప్రతిష్టించిన అమ్మవారి చెంతన కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని కుంకుమతో అర్చించారు.