భారత క్రికెటర్ అనురీత్ సింగ్ సోమవారం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అనురీత్ సింగ్ 2018-19 సీజన్ వరకు రైల్వేస్ కు, 2019-20 సీజన్లో బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు. సిక్కిం తరపున ఆడే ఈ రైట్ ఆర్మ్ మీడియం-ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ లో ఆర్ఆర్ (2018), పంజాబ్ కింగ్స్ (2014) జట్ల తరపున ఆడాడు. 23 ఐపీఎల్ మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు.