గుంతకల్లు పట్టణంలోని 26, 28, 31 వార్డులలోని హమాలీ కాలనీ, భాగ్యనగర్, మస్తాన్ పేట ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను సోమవారం మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విశ్వనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలనీలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేసి చెత్తను ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల లో కంపోస్టు యార్డుకు తరలించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. మురికి కాలువలను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసి దోమల నివారణ కోసం మందును స్ప్రే చేయించాలన్నారు.