తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామి కి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని యుగ పురుషుడు నందమూరి తారక రామారావు పేరును అలాగే కొనసాగించాలని కోరుతూ పెనుకొండ పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేశవయ్య, ట్టణ అధ్యక్షుడు రవిశంకర్, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ చౌదరి, సీనియర్ నాయకులు రామక్రిష్ణప్ప, కురుబ కృష్ణమూర్తి, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అశ్వర్థ నారాయణ, టి ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు పాలడుగు చంద్ర, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి, కన్నా స్వామి, తోట గేరిశ్రీనివాసులు, ఆవుల నరేంద్ర, నంజుండ, కౌన్సిలర్ గీతా హనుమంతు, మాజీ సర్పంచ్ చంద్రకాంతమ్మ, నారాయణ నాయక్, ఎంపీటీసీ రమణమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు గాయత్రి, బాబుల్ రెడ్డి, గొందిపల్లి సూరి, వడ్డె చంద్ర, అక్కులప్ప, సుధాకర్, వడ్డే ఆది, వడ్డే సీన తదితరులు పాల్గొన్నారు.