కళ్యాణదుర్గం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో పరిధిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరములలో పట్టుబడిన 22 ద్విచక్ర వాహనాలను ఈనెల 28వ తేది బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అనంతపురం ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం పోలీసు స్టేషన్ ఆవరణము నందు బహిరంగ వేలము వేయబడును. ఆసక్తి కలవారు రూ. 3వేలు ధరావత్తు రుసుమును చెల్లించి వేలమునందు పాల్గొనవచ్చన్నారు.