ముందు వెళ్తున్న గొర్రెను మిగిలిన గొర్రెలు గుడ్డిగా అనుసరిస్తాయని మనకు తెలుసు. అయితే అలాంటి అమాయకత్వం మనుషులలో కూడా ఉంటుంది. తాజాగా బ్రెజిల్‌లో ఈ తరహా ఘటన జరిగింది. రెస్టారెంట్ వెలుపల కొందరు కసరత్తులలో భాగంగా రన్నింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో సమీపంలోని రెస్టారెంట్‌లో తింటున్న కస్టమర్లు భయపడ్డారు. ఏదో జరిగిందని భావించి, తింటున్నది మధ్యలోనే వదిలేసి పారిపోయారు. తీరా అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే పారిపోయిన వారు బిల్లు చెల్లించారో లేదోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.