చిత్తూరు: మదనపల్లి సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ప్రసవ సమయంలో ఓ శిశువు మృత్యువాత పడింది. మూడవ కాన్పులో శిశువు మృతి చెందడానికి కేవలం వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా బంధువులు ఆరోపించారు. తమ బిడ్డ మృతికి కారణమైన వైద్యులపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకి దిగారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ, కింది స్థాయి అధికారులు స్పందించలేదని ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి వైద్యలే కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. అస్పత్రిలో క్వాలిఫైడ్ సిబ్బంది, డాక్టర్లు లేని కారణంగానే ఇలాంటి మరణాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికయినా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్చి ఉంది.