విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం దంపతులు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో వున్న అమ్మవారిని మంగళవారం స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో భ్రమరాంబ స్పీకర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు స్పీకర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేయడంతో పాటు అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం మరియు ప్రసాదాలు స్పీకర్ దంపతులకు అందజేశారు. ఈ సమాచారాన్ని ఆముదాలవలస స్పీకర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.