సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని భార్యను చంపిన ఘటన బిహార్ లోని భోజ్ పూర్ లో జరిగింది. అనిల్ భార్య అన్నూ ఖాతూన్ తరచూ రీల్స్ చేస్తుండేది. ఇది నచ్చని అనిల్.. ఫోన్ లోని యాట్లు డిలీట్ చేయమని చెప్పాడు. ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్.. భార్య గొంతు నులిమి చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా 'నా భార్య వీడియోలు చూసి ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. అందుకే చంపేశా' అని ఒప్పుకున్నాడు.