దసరా వేడుకలను పురస్కరించుకొని పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం-అరకు-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను 1 అక్టోబర్ నుండి 9 అక్టోబర్ వరకు ఏర్పాటు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ. కె. త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు 1 నుండి 9 వరకు ప్రతిరోజూ 08. 30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి అరకుకు 11. 30 గంటలకు చేరుకుంటుందని తిరుగు దిశలో అరకు-విశాఖపట్నం ప్రత్యేక రైలు 1 నుండి 9 వరకు ప్రతిరోజూ 14. 00 గంటలకు అరకు నుండి బయలుదేరి విశాఖపట్నం 18. 00 గంటలకు చేరుకుంటుందన్నారు. ప్రజలు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు హెల్ప్ లైన్ అయిన 139కి కాల్ చేయవచ్చని తెలిపారు.