మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొని స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లూథరన్ చర్చి లో ప్రత్యేక ప్రార్థన లో పాల్గొన్నారు. వైసిపి పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్. సంక్షేమం గోరంత..బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారు.పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలి అని అయన పిలుపునిచ్చారు.