బ్రిటిష్ వారి చెర నుండి భారతదేశానికి విముక్తి కలిగించడానికి, నా దేశం స్వాతంత్ర్య దేశంగా ,నా దేశ వాసులు స్వతంత్రులుగా , స్వేచ్ఛ హక్కులతో బ్రతకాలి అని బంధాలని , భాంధావ్యాలని విడిచి పెట్టి దేశం కోసం , ప్రజల కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసారు. వారి త్యాగ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అంటే నమ్మక తప్పదు. ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినప్పటికీ కొంతమంది పేర్లు మాత్రం నిత్యం ప్రజలలో సజీవంగానే ఉన్నాయ్. వారిలో ప్రముఖంగా చెప్పాలంటే భగత్ సింగ్ ఒకరు. అతి చిన్న వయస్సు లోనే ఉరి తాడుని ముద్దాడిన భారతదేశ ముద్దుబిడ్డ , స్వతంత్ర సమర యోధుడు పుట్టిన రోజు ఈ రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా యావత్ భారత దేశ పౌరులందరి తరపున భారత స్వాతంత్ర్య సమర యోధుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అసమాన దేశభక్తుడు షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆ అమరవీరుడికి ఘనంగా నివాళులు అర్పిద్దాం.