యూపీలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది వరకు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డా.. తీవ్ర ఇబ్బందులతోనే జీవిస్తున్నారు. తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లఖీంపూర్‌భేరిలో ఓ ప్రైవేటు బస్సు – ట్రక్కు ఢీకొని 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఇక క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించింది. అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదాలు జరుగకుండా కఠినమైన నిబంధనలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలున్నాయి. మద్యం తాగి వాహనాలు పడపడం, ఓవర్‌టెక్, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు.