ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల అనేక నష్టాలున్నాయి. ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైతే చెవిలో పోటు, ఇరిటేషన్, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి ఎనిమిది గంటలకుపైగా హెడ్ ఫోన్స్ ఉపయోగించేవారిలో చెవులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. స్టెరిలైజ్ చేయని ఇయర్ పాడ్స్, ఇయర్ ప్లగ్స్ వల్ల ఇన్‌ఫెక్షన్ సులభంగా వ్యాపించే అవకాశం ఉందన్నారు.