తాజాగా అమెరికా డాలర్ దడ ప్రపంచంలోని వివిధ దేశాలకు పట్టుకొంది. ఎన్నడూ లేని విధంగా అమెరికన్ డాలర్ బలపడుతుండటం... ఇతర దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. డాలర్ డిమాండ్ గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది. ప్రపంచ ప్రధాన కరెన్సీలన్నీ విలువను కోల్పోతున్నాయి. మన కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే రూ. 82కు సమీపంలోకి పడిపోయింది. మరోవైపు అన్ని రంగాలలో అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్న చైనా కరెన్సీ సైతం కుదేలవుతోంది. 2011 నుంచి ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి చైనా కరెన్సీ యువాన్ పడిపోయింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా యువాన్ ఇంత స్థాయికి దిగజారలేదు. డాలర్ తో పోలిస్తే పౌండ్, యూరోల విలువ కూడా భారీగా పతనమయింది.