అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో స్వయంభువుగా వెలసిన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం మూడవ రోజు అమ్మవారు ధాన్య లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామునుండే అర్చకులు బాలాజీ స్వామి అమ్మవారికి తిరుమంజన అభిషేకం, శ్రీచక్ర అర్చన, మహా మంగళ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.