వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కావడం కొంచెం కష్టమవుతుంది. ఈ సీజన్లో తేలికైన, జీర్ణమయ్యే ఆహారం తినడం మంచిది. వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సీజన్‌లో జంతువులలో అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి.వాటి కారణంగా నాన్-వెజ్ తినడం వల్ల మీకు కూడా హాని కలుగుతుంది.