ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. - గుంటూరులో బీసీ నాయకుడు మండల్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకోవడానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. రోజుకో ప్రాంతంలో వైఎస్ విగ్రహాలు పెడుతుంటే వాటికి అనుమతి అవసరంలేదా? అని అధికారులను ప్రశ్నించారు. మండల్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.