వడ్డీ రేట్లపై ఆర్బీఐ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేపో రేటు 5.4 శాతం నుంచి 5.9 శాతానికి పెరగనుంది. దీంతో గృహ, వాహన రుణాలపై మరింత భారం పడనుంది. ఏడాదిలో 4 సార్లు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మే నెల నుంచి ఇప్పటివరకు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకే వడ్డీ రేట్లను పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది.