మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. దీని వలన కలిగే ప్రమాదాలు , మేథో పాటు ఎదుటివారికి కూడా హాని కలిగించేలా ఉంటాయి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఐనప్పటికీ కొంతమంది మాత్రం ఇవేవి లెక్కచెయ్యకుండా తమ పంథాలో తాము వెళ్తున్నారు. ఎలాంటి వారిపై తాజాగా కాకినాడ పోలీస్ చర్యలు తీసుకోక తప్పలేదు . ఇందులో భాగంగా ముగ్గురికి జైలు శిక్ష కూడా పడినట్లు సమాచారం. అరెస్ట్ కాబడిన వారిలో 51 మందికి ఒక్కొకరికి 10,000/- చొప్పున జరిమాన విధించిన గౌరవ 5వ అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అని SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు IPS హెచ్చరించినారు.