ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం లో బంధంచర్ల ఫారెస్ట్ లో అక్రమముగా నాటు సారా తయారు చేస్తున్న శిబిరాలపై పోలీస్ శాఖా దాడులు నిర్వహించి నాటు సారా తయారీకి ఉపయోగించిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ప్లాస్టిక్ డ్రమ్ములను కూడా ధ్వంసం చేసినారు. అనంతరం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా 50 లీటర్ల నాటు సారాను, ఒక వ్యక్తిని మరియు ఒక మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకోని అతని పై కేసు నమోదు చేసినారు.