ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తాడిపత్రికి చెందిన అబ్దుల్ బాషా, ఆయేషాలకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. లారీ క్లీనర్ అయిన అబ్దుల్ ఇటీవల వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇక రోజూ తాగొచ్చి భార్య ఆయేషాను కొట్టేవాడు. వేధింపులు భరించలేని ఆయేషా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భర్తను చంపేసింది. రోకలి బండతో భర్త తలపై కొట్టి ప్రాణం తీసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.