మంగళగిరి జాతీయ రహదారిలోని కొండపనేని టౌన్ షిప్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం పై వెళుతున్న ఇద్దరు ప్రమాదంలో గాయపడ్డారు. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ఆర్కే ప్రమాదాన్ని చూసి ఆగి తన సొంత వాహనంలో క్షతగాత్రులను ఎన్నారై హాస్పటల్ ఎమర్జెన్సీ వార్డ్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడిని మహిళకు, పురుషుడికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ సందర్బంగా క్షతగాత్రలు ఎమ్మెల్యే ఆర్కేకి ధన్యవాదాలు తెలిపారు.