ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్లోని జపొర్జియా నగరంపై జరిపిన దాడిలో 23 మంది చనిపోయారు. మరో 28 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ శుక్రవారం వెల్లడించారు. రష్యా ఆక్రమిత ప్రాంతంలోని తమ వారిని తీసుకొచ్చేందుకు బాధితులంతా వెళ్లారన్నారు. ఆ సమయంలో వారిపై రష్యా సైన్యాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయని ఆరోపించారు.