పచ్చి బఠానీల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బఠానీలలో లుటిన్ కెరోటినాయిడ్ కళ్లలో కంటిశుక్లం రాకుండా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. శనగల్లో ఉండే ఫైబర్ గుండె జబ్బులను నివారిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చు. మలబద్ధకం సమస్య పోతుంది.