రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచనలు మేరకు మందస మండలం హంసరాళ గ్రామ పంచాయతీ లో ఎంపీపీ నిధుల నుండి చిక్కిడిగాం జంక్షన్ మందస రోడ్డు దగ్గర బస్సు షెల్టర్ మంజూరు చేశారు. శనివారం ఎంపీపీ డొక్కరి దానయ్య శంకుస్థాపన బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ లు సీర ప్రసాద్, కొర్నాన ఆదినారాయణ, జడ్పీటీసీ ప్రతినిధి సవర బాలకృష్ణ, బాడ జగన్నాయకులు, స్థానిక సర్పంచ్ బురద జగదీశ్, నర్సింగుపురం సర్పంచ్ గేదిల పద్మనాధం, మందస సర్పంచ్ చెరుకపల్లి ఎల్లమ్మ లక్ష్మణ్ , బృందావనం, కూరగౌడ్ , జి తిరుపతి రెడ్డి , బరాటం జయప్రకాశ్ గారు, టీ. హరి, మహిళ సంఘం అధ్యక్షులు బల్ల లీలకుమారి, పులారి తవిటయ్య, సర్పంచ్ సవర రమేష్ , తమిరి శోభన్ పాల్గొన్నారు.