క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ మరియు సనత్ జయసూర్య ఒకరినొకరు ఎదుర్కోవడాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. 2000-05 నాటి క్రికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు వీరిద్దరూ మరోసారి క్రికెట్ మైదానంలో పోటీపడనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం ఇండియా లెజెండ్స్‌తో శ్రీలంక లెజెండ్స్ పోటీపడనుంది. సచిన్ టెండూల్కర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా ఉండగా, తిలకరత్నే దిల్షాన్ శ్రీలంక లెజెండ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. రాయ్‌పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఈరోజు (శనివారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది కలర్స్ నైన్‌ప్లెక్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మీరు Woot యాప్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.
గతేడాది జరిగిన తొలి ఎడిషన్‌లో ఇండియా లెజెండ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ ఏడాది కూడా భారత్ ఫైనల్‌లో శ్రీలంకతో తలపడింది. అందులో భారత్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈసారి విజయం సాధిస్తామని శ్రీలంక కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించగా, వెస్టిండీస్‌పై శ్రీలంక గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా లెజెండ్స్: ఓజా, సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, రాజేశ్ పవార్, అభిమన్యు మిథున్, మునాఫ్ పటేల్, రాహుల్ శర్మ
శ్రీలంక లెజెండ్స్: మహేలా ఉదవట్టే, సనత్ జయసూర్య, దిల్షాన్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, జయరత్నే, చమర సిల్వ, జీవన్ మెండిస్, చతురంగ డి సిల్వా, గుణరత్నే, ఉదాన, కులశేఖర