రేగిడి ఆమదాలవలస మండలం లోని ఉంగరాడ మెట్ట గ్రామంలో గడపగడపకు వైఎస్సార్ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధిదారుల ఇళ్ళ కు రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కంబాల జోగులు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా. లేదా అని లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలు అర్హులైన వారందరికీ అందటము తోనే గడపగడపకు వైయస్సార్ ప్రభుత్వం కార్యక్రమంకు ప్రజల నుండి మద్దతు లభిస్తోందన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అనే విషయాన్ని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే వారికి సచివాలయం ద్వారా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు చేయూత, ఆసరా పథకాలు దేశంలోనే ఆదర్శమన్నారు. కార్పొరేట్ చదువులు చదవలేకపోతున్న పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య కు ఎన్నో కోట్లు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వావిళ్ళపల్లి జగన్మోహన్ రావు, పొట్నూరు మన్మధరావు, పొట్నూరు శ్రీనివాసరావు, పిల్లా గోవిందరావు, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో కాశీ విశ్వనాధ రావు, వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.