నెలరోజుల ముందు వీధి దీపాల మరమ్మతులకు పరికరాలు లేవని చర్చించినా ఆ సమస్యకు పరిష్కారం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇచ్ఛాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో సమస్యలపై చర్చించారు. కస్పా మహంతి వీధి, కస్పా జాలరి వీధుల కాలువలను నిర్మించాలని కోరినా పట్టించుకోలేదని కౌన్సిలర్ ఆశి లీలారాణి నిరసన తెలిపారు.