ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం దారుణమని తెదేపా మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు పేర్కొన్నారు. పట్టణంలో పార్టీనాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించదాన్ని నిరసిస్తూ శనివారం పాయకరావుపేటలో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు.నాయకులు శ్రీను, వరహాలబాబు, రమణ,కృష్ణప్రసాద్, రాంబాబు పాల్గొన్నారు.