సి ఎస్ పురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు త్రిముఖ దుర్గాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ఉదయాన్నే భైరవకోన కు చేరుకొని జలపాతంలో దానాలు ఆచరించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేవస్థానం పాలకమండలి సభ్యులు వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలు అందజేయడం జరిగింది.