అతి వేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు హేతువని జేసీ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లో రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకొంటున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నిరోధక సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రవాణా, ఇంజినీరింగ్, ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వాహన ప్రమాదాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గత నెలలో జరిగిన ప్రమాదా లపై అధికారులతో సమీక్షించారు.
మూడు నెలల్లో జిల్లాలో 192 ప్రమాదాలు జరగగా 88 మంది మృతి చెందారని జిల్లా రవాణాశాఖ అధికారిణి శాంతకుమారి పేర్కొన్నారు. ఆర్డీవో రంగస్వామి, రాయచోటి, రాజంపేట, మదనపల్లె డీఎస్పీలు పి. శ్రీధర్, శివభాస్కర్రెడ్డి, మనోహరాచారి, ఎంవీఐ అనిల్కుమార్, ఎన్ హెచ్ అధికారులు రఘునాథబాబు, మదుసూదన్, డీఎంహెచ్ఎ డాక్టరు కొండయ్య, విద్యుత్తు శాఖ ఈఈ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్ ఆర్. రాంబాబు, ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, డీఈ సురేష్ నాయక్ పాల్గొన్నారు.