రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతిఘటిస్తామని రైతులు, రైతు సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి మాట్లాడుతూ మోటార్ల మీటర్లు బిగించడమంటే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించినట్లేనని పేర్కొన్నారు.
తక్షణం ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండు చేశారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణరావుకు వినతి పత్రం అందజేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్, సీపీఐ నాయకుడు శ్రీని వాసులు, కాంగ్రెస్ నాయకుడు చెన్నకృష్ణయ్య, ఎం. హెచ్. ఎస్ రాష్ట్ర నాయ కుడు సగీర్, నాగభూషణ్ రెడ్డి, దివ్యకుమార్ పాల్గొన్నారు.