గాలివీడు మండలంలోని వెలిగల్లు జలాశయం నుంచి శనివారం 230 క్యూసెక్కుల నీటిని దిగువన పాపఘ్ని నదికి విడుదల చేశామని డీఈ జనార్దన్ తెలిపారు. జలాయంలోకి 375 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. గేటు ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేస్తున్నామన్నారు. గరిష్ఠ నీటి సామర్థ్యం 4. 64 టీఎంసీలు కాగా 4. 19 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు.
వర్షా లను దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని కాపలా ఉంచామన్నారు. జలాశయంలో నీటి నిల్వలు పెరిగితే ఏ సమయంలోనైనా పాపఘ్ని నదికి నీటిని విడుదల చేస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.