మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెం శ్రీ నగర్ కాలనీలో చోరీ జరిగింది. శఠగోపం శ్రీనివాస్ అనే వ్యక్తి కి చెందిన నివాసంలో శనివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వెనుక డోర్ బద్దలకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ బీరువాలోని బంగారం, వెండి, నగదును అపహరించుకుపోయారు. ఈ మేరకు శనివారం రాత్రి బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.