గుంటూరు: మేడికొండూరు మండలం కొర్రపాడు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రవి బైక్ పై వెళ్తుండగా. కొర్రపాడు సమీపంలో రోడ్డు పక్కన వేరొకరి కారు, బైక్ ఢీకొన్నాయి. ఇది చూసిన ఇరువురు బైక్ ని రోడ్డు పక్కన నిలిపి సంఘటన చూసేందుకు రోడ్డుపై అక్కడికి వెళ్లారు. ఇదే క్రమంలో అడ్డుగా ఆర్టీసీ బస్సు ఇద్దరినీ బలంగా ఢీ కొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించారు.