అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని గోపాలపట్నం గ్రామానికి చెందిన 30 మంది భవానీ భక్తులు శనివారం రాత్రి ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థత గురయ్యారు. శనివారం రాత్రి భోజనం అనంతరం భక్తులు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణలో భాగంగా 30 మంది టిఫిన్ చేయగా 30మంది అస్వస్థతకు గురయ్యారు. ఇడ్లీ తిన్న సమయంలో చట్నీలో బొద్దింక పడిందా మరి ఇతర కారణం అన్నది తెలియాల్సి ఉంది. ఏరియా ఆస్పత్రిలో తరలించి వీరికి చికిత్స అందిస్తున్నారు.