నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు రైఫిల్ షూటింగ్ అంటే సరదానే కాదు. మక్కువ కూడా. నూజివీడులో శనివారం రాత్రి డిఏఆర్ కాలేజీలో నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాగానే షూట్ చేయమని రైఫిల్ ను ఇచ్చారు. దీంతో ఆయన గన్ గురిపెట్టి బుల్లెట్ వదిలితే సింగిల్ షాట్ లోనే అది వెళ్లి బుల్ లో దిగింది. దీంతో అక్కడ ఉన్న సిఐతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.