కావలసిన పదార్థాలు
మైదా: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్ స్పూన్లు, బాదం: పావుకప్పు, నెయ్యి: పావు కప్పు, కొబ్బరి తురుము: ఒక కప్పు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: చిటికెడు, యాలకుల పొడి: పావు టీస్పూన్
తయారీ విధానం
ముందుగా రెండుగంటలపాటు నానపెట్టుకున్న బాదం పప్పుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, బియ్యప్పిండి, ఉప్పు, నెయ్యి, బాదం పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి పాకం పట్టుకుని యాలకులపొడి చల్లి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్నపూరిల్లా ఒత్తుకుని రెండుసార్లు సగానికి మలిచి లవంగంతో గుచ్చాలి. ఇలా చేసుకున్న పూరిలను నూనెలో వేయించి, చక్కెర పాకంలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీయాలి. చక్కెర పాకంలో నుంచి తీసిన బాదం పూరిలపై కొబ్బరి తురుము వేసుకుని సర్వ్ చేయాలి.