నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం నెల్లూరుకు విచ్చేయనున్నట్లు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు మినీ బైపాస్ లోని కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు ఎంపీని కలిసి సమస్యలను వివరించేవారు కోవిడ్ నిబంధనలను అనుసరించి రావాలని సూచించారు.