విశాఖ కైలాసపురం సమీపంలోని లక్ష్మీ నారాయణ పురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే నారాయణరావు అనే 80 ఏళ్ల వృద్ధుడిపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురయ్యి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి స్థానికంగా ఉండే వైద్యుడిని పిలిపించి పరిశీలించగా ఆ వృద్ధుడు మృతిచెందినట్లు ఆయన తెలిపాడు. దీంతో స్థానికులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.