ఇరాన్ కు చెందిన ఓ పాసింజర్ విమానంలో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. చైనా వెళ్తున్న ఆ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం వచ్చింది. దీంతో భారత వాయుసేన అప్రమత్తమై వెంటనే రంగంలోకి దిగింది. వాయుసేన ఫైటర్ జెట్లు ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా వైపు వెళ్తోంది. ఆ విమానం చైనా వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు అలర్ట్ గా ఉన్నాయి.