పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లె వద్ద ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్ )నుంచి 4200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు పీబీసీ ఏఈ శ్యాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుందన్నారు. దీనితో మూడు గేట్ల ద్వారా 4200 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతము 9. 40 టీఎంసీలు ఉన్నట్లు ఏఈ తెలిపారు.