ఓ ప్రయాణికుడు తన లో దుస్తులలో 301 గ్రాముల బంగారాన్ని దాచి పట్టుబడ్డాడు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ విభాగం అతన్ని పట్టుకుంది. ఈ కేసు సింగపూర్ కు చెందినదని, రికవరీ చేసిన బంగారం విలువ రూ.15 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగపూర్లో ని కస్టమ్ అధికారులకు కేరళలోని తిరుచ్చి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వారు తనిఖీలు చేయగా అండర్ వేర్ లో బంగారు పేస్ట్ ఉన్న ప్యాకెట్ కనిపించింది.